మంత్రి కేటీఆర్‌ను నిలదీసిన సిరిసిల్ల ప్రజలు..!

ABN , First Publish Date - 2021-09-09T18:08:11+05:30 IST

వరద కష్టాలపై మంత్రి కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు...

మంత్రి కేటీఆర్‌ను నిలదీసిన సిరిసిల్ల ప్రజలు..!

సిరిసిల్ల జిల్లా: వరద కష్టాలపై మంత్రి కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు ప్రశ్నించారు. వరద నీరు వెళ్లిన తర్వాత వస్తే ఎలా? అని నిలదీశారు. తమ ప్రాంతంలో సమస్యలపై ఏకరువుపెట్టారు. దీంతో వారిని మంత్రి సముదాయించే ప్రయత్నం చేశారు. బాధలు అనుభవిస్తేనే తెలుస్తాయా? చూస్తే తెలియదా? అంటూ కేటీఆర్ బదులిచ్చారు. ఎన్నడూ పడనంత వర్షం పడిందని కొంచెం సంయమనం పాటించాలన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి సమస్య లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.


సిరిసిల్లలో జలమయమైన శాంతినగర్‌ కార్మికవాడకు మంత్రి కేటీఆర్ వెళ్లి వరద బాధితులను పరామర్శించి ‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చారు. వరద నీటిలోనే నడుచుకుంటూ ఇంటింటికీ వెళ్లి.. ఎంత డబ్బు ఖర్చయినా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన పలువురు తమ గోడు వెళ్లబోసుకోగా పరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. అంతకుముందు కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వరద పరిస్థితిపై జిల్లా యంత్రాంగంతో కేటీఆర్‌ సమీక్షించారు. 



Updated Date - 2021-09-09T18:08:11+05:30 IST