చెరువు గట్టు వద్ద.. ఈ ఆరుగురు బాలికలు కలిసి.. చివరికి ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు...

ABN , First Publish Date - 2022-04-10T16:43:02+05:30 IST

ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్న వయసులోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు చదువు విషయంలో, మరికొందరు ప్రేమ విషయంలో...

చెరువు గట్టు వద్ద.. ఈ ఆరుగురు బాలికలు కలిసి.. చివరికి ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు...
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో చాలా మంది చిన్న వయసులోనే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు చదువు విషయంలో, మరికొందరు ప్రేమ విషయంలో.. ఇంకొందరు చిన్న చిన్న కారణాలతోనే ఒత్తిడికి గురవుతున్నారు. దాని నుంచి బయటపడలేక చివరకు కొందరు తనువు చాలిస్తుంటే..  ఇంకొందరు, ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, బీహార్‌లో చోటుచేసుకున్న ఘటన.. అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆరుగురు బాలికలు చెరువు గట్టు వద్ద.. ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు..


బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ సమీపంలోని కాస్మా అనే ప్రాంత పరిధికి చెందిన ఆరుగురు బాలికలు కొన్నేళ్లుగా మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు.. ఎవరికీ చెప్పుకోలేని సమస్యలను కూడా ఒకరికి ఒకరు చెప్పుకొని పరిష్కరించుకునేవారు. ఈ క్రమంలో శుక్రవారం ఆరుగురు బాలికలు చెరువు వద్దకు వెళ్లారు. ఉన్నట్టుండి అంతా విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు అప్పటికే మృతిచెందగా.. మిగిలిన బాలికల పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడికి చేరుకుని విచారించారు.

ఒంటరిగా జీవిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి.. ఆ రెండు తప్పులు చేయడానికి.. కారణమేంటో తెలుసుకుని అంతా షాక్..


వారిలో ఓ బాలిక అప్పటికే ఓ యువకుడిని ప్రేమిస్తోందని తెలిసింది. అయితే అతను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. అయితే మిగతా ఐదుగురు బాలికలు ఎందుకు విషం తీసుకున్నారో తెలియలేదు. వారు విషం తాగడానికి కూడా ప్రేమ వ్యవహారమే కారణమా.. లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనూహ్యంగా ఒకేసారి ఆరుగురు బాలికలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

శోభనాన్ని వాయిదా వేస్తున్న భర్త.. ఓ రోజు రాత్రి నిద్రపోతోందనుకుని ఫోన్లో అతడు మాట్లాడేది ఆమె విని..

Updated Date - 2022-04-10T16:43:02+05:30 IST