Abn logo
Nov 22 2020 @ 18:53PM

ఎల్ఓసీ పోస్ట్ జవాను ఆత్మహత్య

Kaakateeya

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎల్‌ఓసీ వెంబడి గస్తీ పోస్ట్‌లో ఉన్న సైనికుడు ఒకరు ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకున్నాడు. సలోట్రి గ్రామంలోని ఇండియన్ ఆర్మీ 39 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆ జవాను హవాల్దార్ ర్యాంక్ కలిగి ఉన్నట్టు తెలిసింది. ఆ ఘటనపై సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్ట్ ఆఫ్ ఎంక్లయిరీ కూడా జరుగుతున్నట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. తనను తాను కాల్చుకోవడంతో తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడని తెలుస్తోంది. కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌గా అతనిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. అయితే అతని ఆత్మహత్యకు ఇతమిత్ధమైన కారణం ఏవిటనేది వెంటనే తెలియలేదు.

Advertisement
Advertisement