Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రీడాకారిణికి ఘన సన్మానం

దహెగాం, నవంబరు 29: మండలానికి చెందిన అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ క్రీడాకారిణి అగాడి స్ఫూర్తికి సోమవారం గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర బాలికల జట్టు తరపున అండర్‌-19 అండర్‌ఆర్మ్‌ క్రికెట్‌ పోటీల్లో మంచి ప్రతిభకబర్చి మ్యాన్‌ ఆఫ్‌ ద సీరిస్‌ను దక్కించు కుంది. సోమవారం ఆమె దహె గాంకు రావడంతో గ్రామస్థులు ఘనస్వాగతం పలికి సన్మానిం చారు. స్ఫూర్తి సిర్పూర్‌(టి) బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

Advertisement
Advertisement