ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

ABN , First Publish Date - 2022-01-19T05:40:57+05:30 IST

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచంలోని నలుమూలలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని టీడీపీ శ్రేణులు కొనియాడారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కడప నగరంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్‌, గోవర్ధనరెడ్డి పాలాభిషేకం చేసి గజమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు.

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు
కడపలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు

తెలుగు ఖ్యాతిని నలుమూలలా చాటిన మహోన్నతుడు

వర్ధంతి వేడుకల్లో టీడీపీ నాయకులు

కడప, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచంలోని నలుమూలలా చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని టీడీపీ శ్రేణులు కొనియాడారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కడప నగరంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు అమీర్‌బాబు, హరిప్రసాద్‌, గోవర్ధనరెడ్డి పాలాభిషేకం చేసి గజమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. బాలకృష్ణ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య ఆధ్వర్యంలో పట్టణ నిరాశ్రయుల కేంద్రంలో అనాథలకు అన్నదానం చేశారు. పులివెందులలో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, రాంగోపాల్‌రెడ్డి, జమ్మలమడుగులో కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు లింగారెడ్డి, నియోజకవర్గ ఇనచార్జ్‌ భూపే్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, శివనాధరెడ్డిలు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.రాజంపేటలో బి.చెంగల్‌రాయులు, చెన్నూరు సుధాకర్‌, రైల్వేకోడూరులో కస్తూరి విశ్వనాఽధనాయుడు, నందలూరులో ఆర్టీసీ మాజీ చైర్మన ఎద్దుల సుబ్బరాయుడు, చిట్వేలిలో నరసింహప్రసాద్‌, కేకే చౌదరి సుబ్బరాయుడు, రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమే్‌షరెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు నివాళులర్పించారు. బద్వేలులో ఓబులాపురం రాజశేఖర్‌, కె.నరసింహనాయుడు, మైదుకూరులో పుట్టా సుధాకర్‌యాదవ్‌, దుంపలగట్టులో రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డిలు పాలాభిషేకం చేశారు. కమలాపురంలో టీడీపీ నాయకులు పుత్తా లక్ష్మిరెడ్డి నివాళులర్పించారు. సీకేదిన్నె, వల్లూరు, పెండ్లిమర్రిలలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగోడు గుండె చప్పుడు ఎన్టీఆర్‌ అన్నారు. తెలుగు జాతి ఖ్యాతి తెలుగువారి అభ్యున్నతి కోసం ఎన్టీఆర్‌ ఎనలేని సేవలు చేశారన్నారు. టీడీపీని స్థాపించి పేదల జీవితాలకు పెన్నిదిగా, అన్నదాతల, ఆడపడుచుల బతుకులకు ఆశాదీపంగా, బడుగులకు పథకాలెన్నో ప్రవేశపెట్టి నూతన ఆశయాలకు మార్గదర్శకమన్నారు. 35 ఏళ్ల స్వార్థ కుటిల రాజకీయాలకు చరమగీతం పాడి ప్రజల సంక్షేమం కోసం తన జీవితం అంకితం చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. 





Updated Date - 2022-01-19T05:40:57+05:30 IST