పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-05-11T05:47:10+05:30 IST

పట్టు రీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సిల్క్‌ రీలర్ల అసోసియేషన నాయకులు డిమాండ్‌ చేశారు.

పట్టు రీలర్ల సమస్యలు పరిష్కరించండి
విలేకరులతో మాట్లాడుతున్న రీలర్ల సంఘం నాయకులు

హిందూపురం టౌన, మే 10: పట్టు రీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సిల్క్‌ రీలర్ల అసోసియేషన నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టుగూళ్ల మార్కెట్‌లో విలేకరులతో మాట్లాడుతూ కరోనా కారణంగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు సిల్కు ఎగుమతి నిలిచిపోయిందని దీనివల్ల కిలో సిల్కుపై రూ.1000 నుంచి రూ.1200 దాకా ధర పడిపోయిందన్నారు. దాని కారణంగా పట్టుగూళ్ల ధరలు కూడా పడిపోయాయన్నారు. దీంతో ప్రభుత్వం సిల్కును సరఫరా చేయాలని లేదంటే బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రీలర్లకు చర్కా యూనిట్లకు విద్యుత ప్లాన కేటగిరి 4 నుంచి 3లోకి మార్చారని దీనివల్ల విద్యుత బిల్లులు అధికంగా వస్తున్నాయన్నారు. గత యేడాది లాక్‌డౌన కాలంలోనే ఇన్సెంటివ్‌ను వెంటనే ఇవ్వాలన్నారు. రీలర్లకు ఇంటి స్థలాలు ఇప్పించాలన్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ సహకరిస్తున్నారుతప్పా ఇతర ప్రజాప్రతినిధులెవరూ మాకు సహకరించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీలర్ల సంఘం అధ్యక్షులు అన్సార్‌, కార్యదర్శి ముస్తఫ, ఖలీల్‌బాష, ఖాజా, నాసిర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T05:47:10+05:30 IST