ఉరి వేసుకుని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:20:28+05:30 IST

మండలంలోని దేగాం గ్రామానికి చెంది న ర్యాపన్‌ బాబన్న(40) బుధవారం ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై పున్నంచందర్‌ తెలిపారు.

ఉరి వేసుకుని ఒకరి మృతి
ర్యాపన్‌ బాబన్న మృతదేహం

భైంసా రూరల్‌, జనవరి 20 : మండలంలోని దేగాం గ్రామానికి చెంది న ర్యాపన్‌ బాబన్న(40) బుధవారం ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై పున్నంచందర్‌ తెలిపారు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం బాబన్న కూలీ పనులు చేస్తూ కుటుం బాన్ని పోషిస్తున్నాడు. గత కొంత కాలంగా మతిస్థిమితం సరిగ్గా లేక పో వడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. బుధ వారం సాయంత్రం వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు బాబన్న కుటుంబానికి, పోలీ సులకు సమాచారం అందించారు. పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం బాబన్న మృత దేహన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2021-01-21T06:20:28+05:30 IST