రైతుల పోరాటానికి మద్దతుగా ఆటపాట

ABN , First Publish Date - 2020-12-04T06:12:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో పోరాడుతున్న కర్షకులకు మద్దతు తెలుపుతూ గురువారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజానాట్య మండలి గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ ఆఽధ్వర్యంలో కళాకారులు ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైతుల పోరాటానికి మద్దతుగా ఆటపాట
ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఆటపాటలో పాల్గొన్న కళాకారులు

సిరిపురం, డిసెంబరు 3: కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో పోరాడుతున్న కర్షకులకు మద్దతు తెలుపుతూ గురువారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రజానాట్య మండలి గ్రేటర్‌ విశాఖ నగర కమిటీ ఆఽధ్వర్యంలో కళాకారులు ఆటపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. డప్పులు వాయిస్తూ గీతాలాపన చేస్తూ కళాకారులు ఆటపాటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే ఉద్యమాల్లో కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి జి.రమణ, గౌరవ అధ్యక్షుడు అరుణజీ, సహాయ కార్యదర్శి ఎం.చంటి, వై.అప్పారావు,సుభాషిణి, కె.సత్యనారాయణ, జి.స్టాలిన్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T06:12:54+05:30 IST