వ్యవసాయ చట్టాలకు విరుగుడు మార్గాలను అన్వేషించండి: సోనియా గాంధీ

ABN , First Publish Date - 2020-09-29T00:15:10+05:30 IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తిరస్కరించే మార్గాలను అన్వేషించమంటూ

వ్యవసాయ చట్టాలకు విరుగుడు మార్గాలను అన్వేషించండి: సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తిరస్కరించే మార్గాలను అన్వేషించమంటూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన ఏం చెప్పారంటే.. ‘ఆర్టికల్ 254(2) కింద బిల్లులను పాస్ చేసే మార్గాలను అన్వేషించాల్సిందిగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను సోనియా గాంధీ కోరారు. ఆర్టికల్ 254(2) కింద కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లు అనంతరం రాష్ట్రపతి దగ్గరకు వస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. 


వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ ఒకవేళ ఏ రాష్ట్రమైనా స్వంతంగా బిల్లును ప్రవేశపెడితే ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందితే కేంద్రం తీసుకొచ్చిన చట్టంలో ఆ రాష్ట్రంలో అమలుకాదు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ మార్గాలనే అన్వేషిస్తోంది. కేంద్రం వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన నాటి నుంచి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. వ్యవసాయ చట్టాలపై ఎక్కువగా నిరసనలు జరుగుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కాగా.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు ఆదివారం రాత్రి రాష్ట్రపతి ఆమోదం పొందడంతో ఈ బిల్లులు చట్టాలుగా మారాయి.

Updated Date - 2020-09-29T00:15:10+05:30 IST