చనిపోయిన కూతురి చేతికి ఇంజెక్షన్‌ చేసిన గుర్తులు.. ఏడుస్తూ కూర్చున్న అల్లుడిపై అనుమానం.. పది నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-10-28T00:55:23+05:30 IST

చనిపోయిన కూతురి చేతికి ఇంజెక్షన్‌ చేసిన గుర్తులు.. ఏడుస్తూ కూర్చున్న అల్లుడిపై అనుమానం.. పది నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

చనిపోయిన కూతురి చేతికి ఇంజెక్షన్‌ చేసిన గుర్తులు.. ఏడుస్తూ కూర్చున్న అల్లుడిపై అనుమానం.. పది నెలల తర్వాత షాకింగ్ ట్విస్ట్..!

నేటి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న చాలా మంది.. ఇప్పటికీ మూఢ నమ్మకాలను విశ్వసిస్తుంటారు. వాటి కారణంగా కొన్నిసార్లు ఆస్తులన్నీ పోగొట్టుకోవడం, అప్పులు చేయడం, వాటిని తీర్చేందుకు హత్యలు చేయడం వంటివి చేస్తుంటారు. కర్ణాటకలో ఇటీవల వెలుగు చూసిన ఓ కేసు సంచలనం సృష్టించింది. చనిపోయిన కూతురి చేతిపై ఉన్న ఇంజెక్షన్ గుర్తులు.. తమ అనుమానికి బలం చేకూర్చాయి. పది నెలల తర్వాత అసలు విషయం బయట పడడంతో అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


కర్ణాటక దావణగెరె జిల్లా న్యామాతి తాలూకా రామేశ్వర గ్రామానికి చెందిన శిల్ప (36), చెన్నేశప్ప (45)కు 2005లో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నేశప్ప డాక్టర్‌గా పని చేస్తుంటాడు. అతడి భార్య శిల్ప కొన్నేళ్లుగా లో బీపీ సమస్యతో బాధపడుతోంది. భర్తే డాక్టర్ కావడంతో ఎప్పటికప్పుడు ఆమెను పరీక్షిస్తూ ఉండేవాడు. అయితే ఇతడికి మూఢ నమ్మకాలపై ఆసక్తి ఉండేది. ఇటీవల చెడు వ్యసనాలకు బానిసైన అతడు.. బాగాఅప్పులు చేశాడు. ఈ క్రమంలో ఓ మాంత్రికుడిని కలిశాడు. వ్యక్తిని బలిస్తే.. ధనం పెరుగుతుందని చెప్పాడు. దీంతో అప్పటి నుంచి ఎవరో ఒకరిని బలిచ్చి, డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉండేవాడు. 


చివరికి తన భార్యనే బలివ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన భార్య శిల్పకు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం ఆస్పత్రికి తరలిస్తున్నట్లు నటించాడు. అయితే కావాలనే ఆలస్యం చేయడంతో ఆమె దారి మధ్యలోనే చనిపోయింది. అనంతరం ఇంటికి తీసుకొచ్చి... బాధపడుతూ అందరినీ నమ్మించాడు. అయితే ఆమె భజంపై ఇంజెక్షన్ చేసిన గుర్తులు ఉండడం, నోటి నుంచి రక్తంతో కూడిన నురగ రావడంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్‌ను సేకరించింది. పది నెలల విచారణ తర్వాత చెన్నేశప్ప కుట్ర బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2021-10-28T00:55:23+05:30 IST