కేంద్ర ప్రభుత్వానికి త్వరలో చరమగీతం

ABN , First Publish Date - 2021-08-10T05:57:53+05:30 IST

కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు త్వరలోనే చరమగీతం పాడడం ఖాయమని అఖిలపక్షం నాయకులు ముల్కలపల్లి రాములు,మండారి డేవిడ్‌కుమార్‌, కొండపల్లి సాగర్‌రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి త్వరలో చరమగీతం
సూర్యాపేటలోని కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నాయకులు

వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు 

సూర్యాపేట (కలెక్టరేట్‌), ఆగస్టు 9: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనకు త్వరలోనే చరమగీతం పాడడం ఖాయమని అఖిలపక్షం నాయకులు ముల్కలపల్లి రాములు,మండారి డేవిడ్‌కుమార్‌, కొండపల్లి సాగర్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ  పాలన నుంచి దేశాన్ని రక్షించాలని కోరుతూ అఖిలపక్షాలు, ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ దేశసంపదను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కొత్తపల్లి శివకుమార్‌, సత్యనారాయణ, యాతాకుల రాజయ్య, సోమయ్య, బొడ్డు విజయ్‌, నెమ్మాది వెంకటేశ్వర్లు, నాగయ్య, వెంకట్‌రెడ్డి, మాధవరెడ్డి, కోట గోపి, బొడ్డు శంకర్‌, వెంకన్న పాల్గొన్నారు. 

రాజ్యాంగ హక్కులను కాపాడాలి 

సూర్యాపేట కల్చరల్‌ : రాజ్యాంగ హక్కులను కాపాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఖమ్మంక్రాస్‌ రోడ్డులోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు దోరేపల్లి శంకర్‌, బాబు, రాములు, ధనుంజయనాయుడు, దంతాల రాంబాబు, అశోక్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

రక్షణదినంగా పాటించాలి 

హుజూర్‌నగర్‌ /హుజూర్‌నగర్‌ రూరల్‌ : క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని భారత్‌ రక్షణ దినంగా పాటించాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.సూర్యనారాయణ కోరారు.  కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో హుజూర్‌నగర్‌లో భారీ ప్రదర్శన అనంతరం, అంబేడ్కర్‌ విగ్ర హం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సీఐటీయూ ఆధ్వర్యంలోనూ మోటార్‌సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జడ శ్రీనివాస్‌, మల్లేశ్వరి, వాసుదేవరావు, శ్రీను, పద్మ, సీతయ్య, సుజాత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రోశపతి, ఎలక సోమయ్య, వెంకన్న, గోవింద్‌, ముస్తాఫా, వెంకన్న పాల్గొన్నారు. 

కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలి

చిలుకూరు :  కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరే కంగా ఉద్యమించాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దొడ్డా వెంకటయ్య డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మొక్క ఎల్లయ్య, షేక్‌ జాని, నాగయ్య, హరీఫ్‌, వీరబాబు, హిమామ్‌, రాము పాల్గొన్నారు. 

వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్న కేంద్రం

మేళ్లచెర్వు:రాజ్యాంగ వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, రాజు, పసుపులేటి రమణ పాల్గొన్నారు. 

కేంద్రం కార్మిక వ్యతిరేకి  

కోదాడ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకి అని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కె.లతీఫ్‌ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పోతురాజు సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కోటమ్మ, రాజ్‌కుమార్‌, మోషీన్‌ పాల్గొన్నారు. 

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో ఉద్యమం

మునగాల :  క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు మామిడి చిన్నరాములు, ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి, ఏఐఎ్‌సఎఫ్‌ నాయకులు అమరోజు సాయి, వేణు, రవీందర్‌రెడ్డి, సుధాకర్‌ పాల్గొన్నారు.

మతోన్మాద శక్తుల నుంచి కాపాడాలి

నేరేడుచర్ల: మతోన్మాద శక్తుల నుంచి రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ జిల్లా మహిళా సమాఖ్య ఉపాధ్యక్షురాలు లక్ష్మి అన్నారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నేరేడుచర్లలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భ్రమరాంబ, నరసమ్మ, లక్ష్మీదేవమ్మ పాల్గొన్నారు. 

కేంద్రం తీరుతో కార్పొరేట్‌లకు లబ్ధి

చింతలపాలెం : కేంద్రం తీరుతో కార్పొరేట్‌లకు లబ్ధిచేకూరుతుందని రాష్ట్ర మహిళా సమఖ్య అధ్యక్షురాలు సృజన అన్నారు. మండల కేంద్రంలోని  అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ శక్తులకు కేంద్రం అప్పగిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి, చింతిరాల రవి, సురేందర్‌, వీరబాబు, సత్యం, రామారావు పాల్గొన్నారు. 

కార్మికుల హక్కుల కాలరాత

తిరుమలగిరి: కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి అన్నారు. ఈ మేరకు తిరుమలగిరి మునిసిపాలిటీ కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎక్బాల్‌, వాసిరెడ్డి, సోమిరెడ్డి, భూతం రవి,  అశోక్‌, మల్లయ్య, ఉప్పలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-08-10T05:57:53+05:30 IST