అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-07-10T10:07:06+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తు న్న నేప థ్యంలో పోలీసు శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజకుమారి ..

అప్రమత్తంగా ఉండండి

విజయనగరం (క్రైం), జూలై9: జిల్లాలో కరోనా వైరస్‌ విజృంభిస్తు న్న నేప థ్యంలో పోలీసు శాఖలోని ఉద్యోగులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. గురువారం పోలీసు కార్యాలయంలోని సమావేశ మంది రంలో బొబ్బిలి సబ్‌డివిజన్‌ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అదృశ్యమైన కేసుల్లో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని, వారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టాలని, ప్రచార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. దర్యాప్తు, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి కేసులను ఛేదించాలన్నారు.


కొవిడ్‌-19 కేసులు పదికంటే ఎక్కువ నమోదైన ప్రాంతాలను హాట్‌ స్పాట్‌ కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ నిబంధనలు కఠినంగా అమలు చెయ్యాలని ఆదే శించారు. పోలీసు అఽధికా రులు వైరస్‌ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించా లని సూచించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యా దులు స్వీకరించుం దుకు స్టేషన్‌ బయట టెంట్‌లు వేసి, చేతులను శుభ్రపరుచుకునేందుకు శానిటైజర్లు, సబ్బులు ఏర్పాటు చెయ్యాలని సూచించారు. సమావేశంలో ఎస్‌ఈబీ ఏఎస్పీ శ్రీదేవి రావు, బొబ్బిలి ఇన్‌చార్జ్‌ డీఎస్పీ పాపారావు, ఏఆర్‌ డీఎస్పీ శేషాద్రి, న్యాయ సలహా దారులు పరుశు రాం, సీఐలు వెంకటప్పారావు, కేశవరావు, బి.ఎం,డి ప్రసాద్‌, రాజు లనాయు డు, డి.రమేష్‌, బొబ్బిలి సబ్‌డివిజన్‌లోని ఎస్‌ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-10T10:07:06+05:30 IST