బ్యాటరీ వాహనంపై స్పీకర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-06-15T06:44:13+05:30 IST

బాన్సువాడ పట్టణంలో కొనసాగుతున్న, నూతనంగా నిర్మించబోయే పలు అభివృద్ధి పనులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బ్యాటరీ వాహనాన్ని నడుపుతూ పరిశీలించారు. ఆయన తన స్వగృహం నుంచి బ్యాటరీ వాహనంలో బయలుదేరి పాత అంగడి బజార్‌లో ని

బ్యాటరీ వాహనంపై స్పీకర్‌ పర్యటన
బాన్సువాడలో బ్యాటరీ వాహనాన్ని నడుపుతూ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

అభివృద్ధి పనులను పరిశీలించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ, జూన్‌ 14: బాన్సువాడ పట్టణంలో కొనసాగుతున్న, నూతనంగా నిర్మించబోయే పలు అభివృద్ధి పనులను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బ్యాటరీ వాహనాన్ని నడుపుతూ పరిశీలించారు. ఆయన తన స్వగృహం నుంచి బ్యాటరీ వాహనంలో బయలుదేరి పాత అంగడి బజార్‌లో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్‌ కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా మున్సిపల్‌ కార్యా లయ నూతన భవన నిర్మాణం, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యా లయాల నూతన భవనాల ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించారు. రాష్ట్రంలోనే బాన్సువాడ నియో జకవర్గంతో పాటు బాన్సువాడ పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా నిలిచేలా పనులు చేపడతామని ఆయ న తెలిపారు. త్వరలోనే నూతన మున్సిపల్‌ కార్యాలయంతో పాటు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ నూతన కార్యాలయాలతో పాటు అన్ని సౌకర్యాలతో అభివృద్ది పనులను ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, సొసైటీ చైర్మన్‌ ఎర్వల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్‌, మండలాధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ పాత బాలకృష్ణ, నాయకులు, తదితరులున్నారు.
యుద్ధప్రతిపాదికన మినీట్యాంక్‌ బండ్‌ మరమ్మతులు
ఫకల్కి చెరువు పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపం లేదు
కాగా, బాన్సువాడలో నిర్మించిన మినీ ట్యాంక్‌ బండ్‌ రహదారి కుంగిన ప్రాంతంలో యుద్ధప్రతిపాదికన మరమ్మతు పనులు చేపట్టి.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించా రు. సోమవారం ఆయన కల్కి చెరువు కట్టపై కొనసాగుతున్న మినీ ట్యాంక్‌ బండ్‌ మరమ్మతు పనులను పరిశీలించి.. విలేకరులతో మాట్లాడారు.   కల్కి చెరువు కట్టను కూడా మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసుకున్నామ న్నారు. మూడు మీటర్ల వెడల్పున్న కల్కి చెరువు కట్టను 8 మీటర్లకు విస్త రించి, అభివృద్ధి చేసిన ఘనత తమదేనన్నారు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో కల్కి చెరువు కట్టపై నిలిచిన నీళ్లు చెరువులోకి ప్రవహించాయని, అందువల్లే కట్ట స్వల్పంగా దెబ్బతిందన్నారు. ఇందులో ఎలాంటి నాణ్యత లోపం, కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యం లేదన్నారు. 

Updated Date - 2021-06-15T06:44:13+05:30 IST