పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మిస్తాం

ABN , First Publish Date - 2021-01-18T05:34:30+05:30 IST

నర్సాపూర్‌ అర్బన్‌ పార్కుకు వచ్చే పర్యాటకులకు మరింతగా ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కు సమీపంలోనే ఉన్న చెరువుకు అతి సమీపంలో సేద తీరేందుకు కాటేజీలు త్వరలో ఏర్పాటు చేస్తామని అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) రాకే్‌షమోహన్‌ దొబ్రియాల్‌ పేర్కొన్నారు.

పర్యాటకుల కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మిస్తాం

పీసీసీఎఫ్‌ రాకేష్‌మోహన్‌ దొబ్రియాల్‌


నర్సాపూర్‌, జనవరి 17 : నర్సాపూర్‌ అర్బన్‌ పార్కుకు వచ్చే పర్యాటకులకు మరింతగా ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కు సమీపంలోనే ఉన్న చెరువుకు అతి సమీపంలో సేద తీరేందుకు కాటేజీలు త్వరలో ఏర్పాటు చేస్తామని అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్‌) రాకే్‌షమోహన్‌ దొబ్రియాల్‌ పేర్కొన్నారు. ఆదివారం నర్సాపూర్‌ అర్బన్‌ పార్కు సమీపంలో ఉన్న రెవెన్యూశాఖ నుంచి చెరువు సమీపంలో ఉన్న 14 ఎకరాల భూమిని తీసుకున్నట్లు తెలిపారు. దీంట్లో ప్రత్యేకంగా ఐదు కాటేజీలు మొదటి దశలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నర్సాపూర్‌ అడవులు అతి సమీపంలో ఉన్నందున పర్యాటకులు పెద్దసంఖ్యలో వచ్చి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తారన్న ఉద్దేశంతో అర్బన్‌ పార్కును తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆదివారం, ఇతర సెలవు రోజులలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు. పర్యాటకులు కూడా సహజ సిద్ధంగా ఉన్న అడవులను చూడటానికి ఆసక్తి చూపుతుండటంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశమున్నందున ఆ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌, ఎఫ్‌ఆర్‌వో అంబర్‌సింగ్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-18T05:34:30+05:30 IST