సత్‌ ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2021-06-14T05:58:15+05:30 IST

రౌడీషీటర్లు సత్‌ ప్రవర్తనతో మెలగకుంటే కఠినచర్యలు తప్పవని అర్బన్‌ ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ హెచ్చరించారు.

సత్‌ ప్రవర్తనతో మెలగకుంటే కఠిన చర్యలు
నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న సీఐ ప్రేమయ్య, ఎస్‌ఐ సుబ్బారావు

అర్బన్‌లో రౌడీషీటర్లకు స్పెషల్‌ కౌన్సెలింగ్‌

గుంటూరు, జూన్‌ 13: రౌడీషీటర్లు సత్‌ ప్రవర్తనతో మెలగకుంటే కఠినచర్యలు తప్పవని అర్బన్‌ ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు ఆదివారం అర్బన్‌ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో రౌడీషీటర్లకు పోలీసు అధికారులు స్పెషల్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. రౌడీషీటర్లు అందరినీ స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రౌడీయిజం, బెదిరింపులు, వసూళ్లు, పంచాయితీలు వంటి వాటిల్లో తలదూరిస్తే ఏమాత్రం ఉపేక్షించేదిలేదని హెచ్చరికలు జారీచేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, వివాదాల్లో తలదూర్చినా చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచామని, వారి రోజువారి కార్యకలాపాలను సైతం గమనిస్తామని స్పష్టం చేశారు. 

 

Updated Date - 2021-06-14T05:58:15+05:30 IST