ఫ్రంట్‌ లైన్‌ అధికారులకు ప్రత్యేక కొవిడ్‌ సెంటరు

ABN , First Publish Date - 2021-05-12T05:55:39+05:30 IST

కొవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ అధికారుల కోసం హజ్‌ భవన్‌ కొవిడ్‌కేర్‌లో 100 పడకల ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఫ్రంట్‌ లైన్‌ అధికారులకు ప్రత్యేక కొవిడ్‌ సెంటరు

కలెక్టర్‌ సి.హరికిరణ్‌


కడప(కలెక్టరేట్‌), మే 11: కొవిడ్‌ ఫ్రంట్‌ లైన్‌ అధికారుల కోసం హజ్‌ భవన్‌ కొవిడ్‌కేర్‌లో 100 పడకల ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగర పరిధిలోని హజ్‌ భవన్‌లో 350 బెడ్లతో ఇప్పటికే కొవిడ్‌ కేర్‌ సెంటరు నిర్వహిస్తున్నామని, అందులో 100 పడకలతో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన పోలీసు, రెవెన్యూ, మెడికల్‌ ఇతర ప్రభుత్వ అధికారుల కోసం ప్రత్యేకంగా కొవిడ్‌ విభాగాన్ని ఏర్పాటు చే శామని తెలిపారు. ఇందులో వైద్యుల నిరంతరం పర్యవేక్షణ, ఎక్స్‌-రే, రక్త పరీక్ష, ఈసీజీ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని వివరించారు. కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన వారు కొవిడ్‌ సంబంధిత లక్షణాలతో ఉన్న అధికారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2021-05-12T05:55:39+05:30 IST