దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2020-08-03T11:13:16+05:30 IST

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో దోమల నివార ణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ తెలిపారు.

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో దోమల నివార ణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ తెలిపారు. ప్రతీ ఆదివారం చేపట్టే పది గంటల పది నిమిషాలకు పరి సరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మున్సిపల్‌ కార్యాలయంలో నిల్వ ఉన్న నీటిని, వాటర్‌ఫౌంటేన్‌లో ఉన్న నీటిని మున్సిపల్‌ అధికారు లతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణంలో దోమల సంతతి పెరగకుండా నీటి నిల్వలు ఉన్న చోట ఆయిల్‌బాల్స్‌ వేయడంతో పాటు ఆయా వార్డులలో ప్రజాప్రతినిఽధులు, అధికారుల ద్వారా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన చేపడుతున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఆర్‌ఐ జానయ్య, సిబ్బంది అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2020-08-03T11:13:16+05:30 IST