Advertisement
Advertisement
Abn logo
Advertisement

మలేరియా నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి

లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు3: మలేరియా నివారణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ పేర్కొన్నారు. శుక్రవారం దేవళంపల్లె, కోనంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందికి, ఆశాలకు జాతీయ కీటక జనిత వ్యాధుల అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది గ్రామాల్లో పర్యటించి జ్వరం ఉన్న వారికి రక్తపరీక్షలు నిర్వహించి ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.  డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి ప్రసాద్‌యాదవ్‌, సీహెచ్‌వో శంకర్‌ప్రసాద్‌, విస్తరణ అధికారులు రేఖానాయక్‌, బలరామరాజు,సూపర్‌వైజర్లు  వైద్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement