విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

ABN , First Publish Date - 2022-01-21T04:32:01+05:30 IST

ఎర్రగొండపాలెం గిరిజన గురుకుల పాఠశాలలో గురువారం ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రోగ్రామ్‌ను ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌ ప్రారంభించారు.

విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
మాట్లాడుతున్న జిల్లా గిరిజన సంక్షేమాధికారి లక్ష్మానాయక్‌

ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభం

ఎర్రగొండపాలెం, జనవరి 20 : ఎర్రగొండపాలెం గిరిజన గురుకుల పాఠశాలలో గురువారం ఎఫ్‌ఎల్‌ఎన్‌ ప్రోగ్రామ్‌ను ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌ ప్రారంభించారు.  గత రెండు సంవత్సరాలుగా కరోనాతో పాఠశాలలు సక్రమంగా సాగడం లేదు. దీంతో ఇంగ్లీష్‌, లెక్కలు, తెలుగు సబ్జెక్టులలో విద్యార్థులు చాలా వెనుకబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనకు ప్రతి రోజు సాయంత్రం 2 పీరియడ్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జడ్పీపాఠశాలలో పొగ్రామ్‌లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. గిరిజన పాఠశాలల్లో ఈరోజు నుంచి 100 రోజులు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని గిరిజన సంక్షేమ అధికారి లక్ష్మానాయక్‌  సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ  కిరణ్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యుడు సీహెచ్‌. విజయభాస్కర్‌, ప్రిన్సిపాల్‌ సలాంఖాన్‌,  ఎంఈవో పీ ఆంజనేయులు, సర్పంచ్‌ అరుణాబాయ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-21T04:32:01+05:30 IST