పద్మల్‌పూరీకాకో ఆలయంలో గిరిజనుల ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-10-28T03:23:39+05:30 IST

మండలంలోని గుడిరేవు గోదావరి నది తీరం ఒడ్డున గల పద్మల్‌పూరీకాకో ఆలయంలో బుధవారం గిరిజనం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పద్మల్‌పూరీకాకో ఆలయంలో గిరిజనుల ప్రత్యేక పూజలు
దండేపల్లి మండలం గుడిరేవు పద్మల్‌పూరీకాకో ఆలయం వద్ద గుస్సాడీ వేషధారణతో నృత్యం చేస్తున్న గిరిజనులు

దండేపల్లి, అక్టోబరు 27: మండలంలోని గుడిరేవు గోదావరి నది తీరం ఒడ్డున గల పద్మల్‌పూరీకాకో ఆలయంలో బుధవారం గిరిజనం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుస్సాడీ వేషధారణలతో డప్పుచప్పులతో నృత్యాల మధ్య గుడిరేవు గోదావరి తీరానికి చెరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అక్కడి నుంచి ఆలయానికి చేరుకుని కాకో అమ్మవారిని దర్శించుకుని గిరిజన సంప్రదాయబద్ధంగా దండారీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేక పిండి పదార్ధాలు వండి అమ్మవారికి  నైవేద్యం సమర్పించారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో గిరిజనులు గుస్సాడీ వేషధారణలతో డప్పుచప్పులతో ఆటపాటలతో ప్రత్యేక భజన కార్యక్రమాలతో సందడి చేశారు. అనంతరం కుటుంబసమేతంగా బంఽధు, మిత్రులతో ఆలయ ప్రాంగణంలో సామూహిక భోజనాలు చేశారు.

Updated Date - 2021-10-28T03:23:39+05:30 IST