Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు

కొవ్వూరు, డిసెంబరు 6: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని మంత్రి తానేటి వనిత అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ స్టేడి యంలో నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమంలో సోమవారం ఆమె పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 400 మంది క్రీడాకారుల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌ తదితర క్రీడల్లో పాల్గొన్నారు. విజేతలకు పతకాలను అందించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భావన రత్రకుమారి, జడ్పీటీసీ బొంతా వెంకటలక్ష్మి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవి, కోడూరి శివరామకృష్ణ, చాగల్లు ఎంపీపీ మట్టా వీరస్వామి, కౌన్సిలర్లు ఆర్‌.భాస్కరరావు, అక్షయపాత్ర శ్రీనివాస్‌ రవీంద్ర, ఎంపీడీవో జగదాంబ, ఎంఈవో జె.కెంపురత్నం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement