విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి

ABN , First Publish Date - 2021-12-02T06:57:01+05:30 IST

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని డీఆర్డీఏ పీడీ కిషన్‌ కోరారు. బుధవారం మండలంలోని బరంపూర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు

విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న డీఆర్డీఏ పీడీ కిషన్‌

 బరంపూర్‌లో ప్రారంభమైన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

తలమడుగు, డిసెంబరు 1: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని డీఆర్డీఏ పీడీ కిషన్‌ కోరారు. బుధవారం మండలంలోని బరంపూర్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జిల్లాస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడ ల్లో రాణించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్నక్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మండల, జిల్లా స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో రాణించి అవార్డులను తీసుకు రావాలని కోరా రు. ప్రభుత్వం సైతం క్రీడాకారులను గుర్తించేందుకు ప్రత్యేకంగా క్రీడా పాఠశాల ను జిల్లాలో ఏర్పాటు చేసిందన్నారు. బరంపూర్‌లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కబడ్డీ పోటీలకు జిల్లా న లుమూలల నుంచి వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి పాఠశా ల యజమాన్యం, గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. ఇందులో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్‌యాదవ్‌, ఎంపీఈఓ నారాయణ, ఎస్సై ప్రవళిక, ఎంపీడీఓ రమాకాంత్‌, దేవాలయ కమిటీ అధ్యక్షుడు కేదరేశ్వర్‌రెడ్డి సర్పంచ్‌ భగీరథబాయి, ఉప సర్పంచ్‌ నారాయణరెడ్డి, పంచాయతీ సెక్రటరీ అనిల్‌రెడ్డి, క్రీడా ఉపాధ్యాయులు, జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు.

టేకు వనాన్ని పరిశీలించిన అధికారులు

తలమడుగు మండలంలోని బరంపూర్‌ గ్రామంలో హారితహారం కింద సాగు చేస్తున్న టేకు వనాన్ని బుధవారం జిల్లా అధికారులు, డీఆర్డీఏ పీడీ కిషన్‌ పరిశీలించారు. సందర్భంగా పీడీ కిషన్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హారితహారం కార్యక్రమంలో భాగంగా వాణిజ్య పంటలైన టేకు మొక్కల సాగు బరంపూర్‌లో చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. బరంపూర్‌లో సాగు చేస్తున్న టేకు వనం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని సూచించారు. వచ్చే సంవత్సరం చేపట్టే హారితహారం కార్యక్రమానికి జిల్లాలోని ప్రతీ పంచాయతీలో 10 నుంచి 20 వేల మొక్కల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. కాగా బరంపూర్‌ కొండ సమీపంలో ఏర్పాటు చేసిన టేకు వనంతో కొండకే అందం వచ్చిందన్నారు.  

Updated Date - 2021-12-02T06:57:01+05:30 IST