మరో 931..శరవేగంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌

ABN , First Publish Date - 2020-08-14T11:31:32+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం మరో 931 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

మరో 931..శరవేగంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌

జిల్లాలో 22,929కి చేరుకున్న కేసులు

గడచిన 24 గంటల్లో ఆరుగురి మృతి

మొత్తం మరణాలు 156


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. గురువారం మరో 931 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,929కి చేరింది. వైరస్‌ బారినపడిన వారిలో 16,468 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో 6,305 మంది వేర్వేరు ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కాగా వైరస్‌ బారినపడి చికిత్స పొందుతూ గురువారం మరో ఆరుగురు మృతిచెందారు. దీంతో కొవిడ్‌ మరణాల సంఖ్య 156కు చేరింది. 


జోన్‌- 1లో 56 కేసులు

గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) జోన్‌-1 పరిధిలో గురువారం 276 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 56 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. ఒకటో వార్డులో 111 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి, ఐదో వార్డులో 106 మందికి పరీక్షలు చేయగా 20 మందికి, 6వ వార్డులో 59 మందికి పరీక్షలు నిర్వహించగా 17 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు.


పెందుర్తిలో 50..: పెందుర్తి పీహెచ్‌సీ పరిధిలో 134 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం 50 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి ఎన్‌ఎస్‌ఆర్‌ చక్రవర్తి తెలిపారు.


మాధవదార, మురళీనగర్‌లలో 31: మాధవధార వుడా కాలనీలో 9, కళింగనగర్‌లో 7, మాధవధార జంక్షన్‌లో 4, తెన్నేటినగర్‌లో ఒక కేసు కలిపి మొత్తం 21 కేసులు వచ్చాయి. అలాగే మురళీనగర్‌, సత్యానగర్‌, ఎన్‌జీజీవోస్‌ కాలనీ ప్రాంతాల్లో 10 కేసులు వెలుగుచూశాయి. 


ఆరిలోవలో 23: ఆరిలోవ రిఫరల్‌ ఆస్పత్రిలో గురువారం 112 మందికి కరోనా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ అనిత తెలిపారు.


సింహాచలంలో 18: సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో గురువారం 72, 69 వార్డులకు చెందిన 82 మందికి కొవిడ్‌ వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 18 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి వాసుదేవరావు తెలిపారు. 


8వ వార్డులో 14: సాగర్‌ నగర్‌ ఆరోగ్య కేంద్రంలో గురువారం సాగర్‌ నగర్‌, రుషికొండ ప్రాంతాలకు చెందిన 59 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 14 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. 


ఆనందపురంలో 12: ఆనందపురం మండలంలో 12 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యాధికారి శైలజ తెలిపారు. మండలంలోని వేములవలసలో నలుగురికి, ప్రసాదువానిపాలెంలో నలుగురికి, గండిగుండంలో ఇద్దరికి, శిర్లపాలెంలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.


జీవీఎంసీ 70వ వార్డు ఎల్వీ నగర్‌లో భార్య,భర్తలకు కరోనా సోకింది.  

గోపాలపట్నం పరిసర ప్రాంతాల్లో గురువారం ఆరుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్థానిక పాతగోపాలపట్నంలో నలుగురు, లక్ష్మీనగర్‌లో ఇద్దరు వైరస్‌ బారిన పడ్డారు.

పద్మనాభం రెండు కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖాధికారులు గురువారం తెలిపారు. కోరాడ పంచాయతీ గెద్దపేటలో ఒకరికి, పాండ్రంగి పంచాయతీ ఏనుగులపాలెంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిపారు.  

పరవాడ మండలంలోని తాణాం గ్రామానికి చెందిన పురుషుడు, చినతాడి గ్రామానికి చెందిన మహిళకు గురువారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యాధికారిణి యోగిత బాల తెలిపారు. 


అనకాపల్లిలో 31 

అనకాపల్లి టౌన్‌: అనకాపల్లిలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం 111 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, వీరిలో 31 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులతో కలిపి పట్టణంలో వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 954కు చేరింది. గవరపాలెంలో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, కోట్ని వీధిలో 

 

ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, లక్ష్మీదేవిపేటలో మహిళ, వేల్పుల వీధిలో పురుషుడు, కుంచావారి వీధిలో పురుషుడు, నరసింగరావుపేటలో పురుషుడు, బైపాస్‌ జంక్షన్‌లో ఇద్దరు మహిళలు వైరస్‌ బారినపడ్డారు. గాంధీనగరంలో పురుషుడు, బారువారి వీధిలో పురుషుడు, నెహ్రౌచౌక్‌లో పురుషుడు, అనకాపల్లి పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌, న్యూకాలనీలో మహిళ, పురుషుడు, ముత్రాసివీధిలో పురుషుడు, కస్పావీధిలో పురుషుడు, ఏఎంసీ కాలనీ పురుషుడు వైరస్‌ బారినపడ్డారు. చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ ఇక్కడ పరీక్షలు చేయించుకోగా ఆయనకు కూడా పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.


ఏజెన్సీలో 31 కేసులు... 

పాడేరు: ఏజెన్సీలో మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. వివిధ మండలాల్లో 152 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో 31 మందికి పాజిటివ్‌ వచ్చింది. పాడేరులో 6, సీలేరులో 6, జి.మాడుగులలో 5, అనంతగిరిలో 4, అరకులోయలో 4, పెదబయలులో 3, హుకుంపేటలో 2, డుంబ్రిగుడలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీలో ఇంతవరకు 407 మంది వైరస్‌బారిన పడ్డారు. 


కశింకోటలో 10: కశింకోట పీహెచ్‌సీ పరిధిలో మరో పది కరోనా కేసులు నమోదయ్యాయి. స్థానిక కోమటి వీధిలో ఆశ వర్కర్‌, ఇందిరా కాలనీలో పురుషుడు, పోస్టాఫీస్‌ వీధిలో యువకుడు, బీఆర్‌టీ కాలనీలో ఇద్దరు పురుషులతోపాటు మహిళ, సత్యనారాయణపురంలో ముగ్గురు యువతులు, శారదా నగర్‌లో వృద్ధుడు వైరస్‌ బారినపడ్డారు.


అచ్యుతాపురంలో 9...: అచ్యుతాపురం మండలంలో మరో తొమ్మిది పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు అచ్యుతాపురం, హరిపాలెం వైద్యాధికారులు ఆడారి కనకమహాలక్ష్మి, రజని తెలిపారు. హరిపాలెంలో ఇద్దరు పురుషులు, పూడిలో యువకుడు, మహిళ, మార్టూరులో పురుషుడు, జంగులూరులో పురుషుడు, దుప్పితూరులో పురుషుడు, వెదురువాడలో మహిళ, అనకాపల్లి శారదానగర్‌కు చెందిన మహిళ వైరస్‌ బారిన పడ్డారు. 


కోటవురట్లలో ఏడు కేసులు

కోటవురట్ల మండలంలో గురువారం ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు కె.వెంకటాపురం వైద్యాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. యండపల్లిలో మహిళ, బాలిక,  యువతి, పురుషుడు, జల్లూరులో పురుషుడు, యువకుడు, తంగేడులో యువకుడు వైరస్‌ బారిన పడ్డారు.


జి.మాడుగులలో ఐదు... : జి.మాడుగులలో గురువారం 19 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిని పాడేరులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కి తరలించారు. 

  • మాకవరపాలెం మండలంలో నలుగురికి కరోనా వైరస్‌ సోకింది. రాచపల్లిలో వృద్ధుడు, రామన్నపాలెంలో పురుషుడు, మాకవరపాలెంలో ఇద్దరు పురుషులు వైరస్‌ బారిన పడినట్టు తహసీల్దార్‌ రాణి అమ్మాజీ తెలిపారు.
  • నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలో ముగ్గురికి కరోనా సోకింది. వీరిలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. 
  • పాయకరావుపేటలో ముగ్గురికి  కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు, గుంటపల్లిలో యువకుడు వైరస్‌ బారిన పడ్డారు.
  • మాడుగులలో గురువారం మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఎంపీడీవో ఎం.పోలినాయుడు తెలిపారు. 
  • చోడవరం మండలంలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని చందక వీధిలో వృద్ధుడు, వెంకన్నపాలెంలో మహిళ వైరస్‌ బారిపడ్డారు.
  • రాంబిల్లిలో ఒక పురుషుడు, ఒక వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారి జి.అమృతసాయి తెలిపారు. 
  • దేవరాపల్లి మండలం వేచలం పీహెచ్‌సీలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా బి.కింతాడకి చెందిన యువకుడికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి బి.హారిక తెలిపారు. 

నర్సీపట్నంలో ఒకరి మృతి

నర్సీపట్నం టౌన్‌: పట్టణంలోని కాపు వీధికి చెందిన ఓ వ్యక్తి(55) గురువారం కరోనాతో మృతిచెందినట్టు మునిసిపల్‌ అధికారులు తెలిపారు. దగ్గు, జ్వరంతోపాటు శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం ఛాత ఆస్పత్రిలో చేరారు. బుధవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వైరస్‌బారిన పడినట్టు నిర్ధారణ అయ్యింది. అక్కడే చికిత్స పొందుతూ గురువారం చనిపోయినట్టు అధికారులు చెప్పారు.

Updated Date - 2020-08-14T11:31:32+05:30 IST