Abn logo
Sep 7 2021 @ 12:31PM

Srikakulam: చీమలవలస యూ.పీ స్కూల్‌లో కరోనా కలకలం

శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాలవలస మండలం చీమలవలస యూ.పి స్కూల్‌లో కరోనా కలకలం రేగింది. పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పాఠశాలలోని80 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఉపాధ్యాయులు హోం ఐసోలేషన్‌కు పంపారు. స్కూల్ ఆవరణలో అధికారులు శానిటైజేషన్ చేస్తున్నారు.