Advertisement
Advertisement
Abn logo
Advertisement

Srisailamలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

కర్నూలు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం స్వామిఅమ్మవార్లకు అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. సాయంకాలం స్వామిఅమ్మవార్లకు నంది వాహనసేవ, ఆలయప్రాకారోత్సవం జరుగనుంది. రాత్రికి స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవ కల్యాణానికి ప్రత్యేకంగా చెంచు భక్తులకు ఆహ్వానం అందింది. కల్యాణోత్సవానికి విచ్చేసే చెంచు భక్తులకు దేవస్థానం తరుపున మొట్టమెదటిసారిగా పంచ, కండువా, మహిళలకు చీర, రవికవస్త్రాన్ని దేవస్థానం అందజేయనుంది. 

Advertisement
Advertisement