స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2021-05-08T09:23:20+05:30 IST
కొవిడ్ రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) తెలిపింది. ఈ
హైదరాబాద్, మే 7(ఆంధ్రజ్యోతి): కొవిడ్ రెండో దశ తీవ్రత నేపథ్యంలో ఈ నెలలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తునట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ) తెలిపింది. ఈ నెలాఖరులో, జూన్ మొదటి వారంలో జరగాల్సిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అలాగే ఈ నెల మొదటి వారంలో రావాల్సిన జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ను తర్వాత విడుదల చేయనున్నట్టు తెలిపింది.