Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాయీబ్రాహ్మణులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

 నాయీబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య


సుభాష్‌నగర్‌, డిసెంబరు 2: టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు అండగా ఉందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య అన్నారు. గురువారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుంజపడుగు హరిప్రసాద్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తూ నాయీ బ్రాహ్మణులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏమి చేయలేదని వ్యాఖ్యానిం చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. 2006లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తాము టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌ సమీపంలో సంఘానికి 800 గజాల స్థలం కొనడానికి నాలుగు లక్షల నిధులు అందించారని తెలిపారు. ఆ నిధులకు మరి కొన్ని నిధులు సేకరించి నిర్మాణ పనులు చేపట్టా మని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్‌ రెండు లక్షలు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కల్యాణ మండపం పనులు జరుగుతున్నాయని తెలిపారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తమకు ఇంతటి లబ్ధిని చేకూర్చలేద న్నారు. 15 మంది సభ్యులతో కూడిన సంఘం రిజిస్ర్టేషన్‌ చేసు కున్నవారికి బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలను మంజూరు చేసింద న్నారు. నగరంలో ఇప్పటి వరకు ఎనిమిది సంఘాలు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాయని తెలిపా రు. ఈ సంఘాలకు 30 లక్షల చొప్పున రుణాలు మంజూరు చేశారన్నా రు. ఈ సంఘాల్లో నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక నాయకుడైన గుంజ పడుగు హరిప్రసాద్‌కు సంబంధించి మూడు సంఘాలు ఉన్నాయని, వారు కూడా రుణాలు పొందారన్నారు. 

తెలంగాణ నాయీబ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి ఒక ట్రస్టును ఏర్పాటు చేసుకొని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీకి మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం సంఘ భవనానికి ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించి రెండు కోట్ల నిధులను మం జూరు చేసినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా క్షౌరశాలలు మూసి వేయడం వల్ల నాయీబ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తొమ్మిది రకాల వస్తువులను నాయీబ్రాహ్మణులకు అందించారని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాయీబ్రాహ్మణులకు అండగా ఉందని, ప్రభు త్వం పక్షాన లబ్ది పొందిన గుంజపడుగు హరిప్రసాద్‌ తన స్వలాభం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన ఒక్కడు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తే సంఘం మొత్తం చేసినట్లు కాదని, అది ఆయన వ్యక్తిగతమని అన్నారు. తమకు అండగా ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంట తామంతా ఉన్నామని అన్నారు. సమావే శంలో జిల్లా గౌరవాధ్య క్షుడు ఎర్రబొజ్జు నర్సయ్య, ఉపాధ్యక్షులు అవుదుర్తి లక్ష్మణ్‌కుమార్‌, తమ్మునూరి కుమార్‌, నాగవెల్లి లక్ష్మీనారా యణ, నగర అధ్యక్షుడు జంపాల సంపత్‌, ప్రధాన కార్యదర్శి కంది వెంకటేశ్‌, కోశాధి కారి నీలి గొండ సదానందం పాల్గొన్నారు. 

Advertisement
Advertisement