రాష్ట్రస్థాయి క్విజ్‌ విజేత లండారిపుట్టుగ

ABN , First Publish Date - 2021-10-17T05:14:39+05:30 IST

బూర్జపాడులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్విజ్‌పోటీలో ఇచ్ఛాపురం మండలంలోని లండారిపుట్టుగ విజేతగా నిలిచింది. శనివారం బూర్జ పాడులో సరస్వతి పూజ పురస్కరించుకొని రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు ఏర్పాటుచేశారు.

రాష్ట్రస్థాయి క్విజ్‌ విజేత లండారిపుట్టుగ
లండారిపుట్టుగ జట్టుకు బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

ఇచ్ఛాపురం రూరల్‌ : బూర్జపాడులో  నిర్వహించిన  రాష్ట్ర స్థాయి క్విజ్‌పోటీలో  ఇచ్ఛాపురం మండలంలోని లండారిపుట్టుగ విజేతగా నిలిచింది. శనివారం బూర్జ పాడులో సరస్వతి పూజ పురస్కరించుకొని రాష్ట్రస్థాయి క్విజ్‌ పోటీలు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా విజయన గరం జిల్లాలోని నెల్లిమర్ల (ద్వితీయ), లోహరి బంద (తృతీయ) గోకర్ణపురం (నాలుగు), బి.కేశుపురం(ఐదో) స్థానంలో నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే అశోక్‌ బహు మతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే పోటీతత్వం అలవరచుకోవాలని తెలిపారు. క్విజ్‌ మాస్టర్లగా శమళ్ల రాజబాబు, బి.శ్రీనివాసరావు, బి.నీలాచలం, ఎం.భూషణ్‌ వ్యవహరించారు.  కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పూజా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 

  

Updated Date - 2021-10-17T05:14:39+05:30 IST