నేరాల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-10-24T05:44:04+05:30 IST

నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. ధర్మపురి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని శనివారం ఉదయం ఆమె సందర్శించారు.

నేరాల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలి
మొక్కలు నాటుతున్న జిల్లా ఎస్పీ సింధూశర్మ

ధర్మపురి పోలీస్‌ సర్కిల్‌ ఆఫీస్‌ను సందర్శన

మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ సింధూశర్మ

ధర్మపురి, అక్టోబరు 23: నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సింధూశర్మ అన్నారు. ధర్మపురి పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని శనివారం ఉదయం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను ఆమె పరిశీలించారు. నేరాల సంఖ్య, ప్రమాదాలు, సిబ్బంది పని తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఆమె నేరాలు, శాంతి భద్రతల పరిస్థితి గురించి పోలీస్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర్మపురి సర్కిల్‌ పరిధిలో గల నేషనల్‌ హైవే, స్టేట్‌ హైవే పైన ప్రమాదాలు నివారణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగి, నేరాలకు పాల్పడిన వ్యక్తులను త్వరగా పట్టుకునే అవకాశం ఉందన్నారు. జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాష్‌, ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్‌, శంకర్‌ నాయక్‌, మనోహర్‌రావు, ఉపేంద్రాచారి పాల్గొన్నారు. అనంతరం పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయం ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. 

Updated Date - 2021-10-24T05:44:04+05:30 IST