Abn logo
Oct 27 2021 @ 23:00PM

రిజిస్ర్టేషన్‌లు అయ్యేలా చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న నగర పంచాయతీ చైర్మన్‌ గఫార్‌

- నగర పంచాయతీ చైర్మన్‌ గఫార్‌

కనిగిరి, అక్టోబరు 27: నగర పంచాయతీ పరిధిలో 43 సర్వే నెంబర్లు రిజిస్ర్టేషన్‌ అనర్హత జాబితాలో పడ్డాయని, వాటి గురించి ఆందోళన చెందవద్దని నగర పంచాయతీ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. స్థానిక కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని కాశీనాయనగుడి, చింతలపాలెం, శంఖవరం, ఆర్టీసీ డిపో వెనుక, బోయపాలెం, అర్బన్‌ కాలనీ, మాచవరం తదితర ప్రాంతాల్లో దాదాపు 43 సర్వేనెంబర్లు రిజిస్ర్టేషన్లు చేసేందుకు తిరస్కరణకు గురయ్యాయన్నారు. ఈమేరకు తగిన జాబితా తీసుకుని అమరావతిలో రిజిస్ర్టేషన్‌ అనర్హత పొందడానికి కారణాలను తెలుసుకుంటున్నామన్నారు. పూర్తి వివరాలు అమరావతి నుంచి వచ్చిన అనంతరం తీసుకుంటామన్నారు. కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు మాట్లాడుతూ ప్రస్తుతం చాలా చోట్ల భూమి కన్వర్షన్‌ కాకుండా ప్లాట్లు వేశారన్నారు. వాటిల్లో ప్లాట్లు కొన్న వ్యక్తులు ఆయా భూమిలో గృహనిర్మాణం చేపట్టాలంటే మున్సిపాలిటి నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ పొందేందుకు వీలుకాదన్నారు. ప్లాన్‌ అప్రూవల్‌ ఇవ్వాలంటే అఽధిక జరిమానా చెల్లించి అప్రూవల్‌ పొందాలని సూచించారు. అంతే కాకుండా ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా సెటిల్‌మెంట్‌ భూమి వెంచర్‌  కన్వర్షన్‌ ప్రక్రియ అనంతరం మున్సిపాలిటి పరిఽధిలోని వెంచర్లకు ఆయా నిర్వాహకుల ద్వారా జరిమానా విధించి రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు. ఖాళీ స్థలాల యజమానులు తప్పని సరిగా తమ స్థలానికి పన్ను మున్సిపాలిటికి చెల్లించాలని సూచించారు. తద్వారా భవిష్యత్తులో గృహనిర్మాణ అప్రూవల్‌ త్వరగా వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో టీపీఎస్‌ శాంతి, మున్సిపాలిటి సిబ్బంది ఉన్నారు.