భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

ABN , First Publish Date - 2021-01-27T19:48:13+05:30 IST

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

ముంబయి: ప్రతికూల సంకేతాలు, అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటు మదుపరులు కీలక రంగాల్లో లాభాలు స్వీకరిస్తుండడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఈ రెండు అంశాలు ప్రధానంగా సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసాయి. అంతేకాకుండా ప్రభుత్వరంగం సంస్థల ప్రైవేటీకరణ విధానంపై కేంద్రమంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంటుందంటూ వచ్చిన వార్తలు.. బ్యాంకింగ్, చమురు రంగ షేర్లను కుదేలు చేశాయి. ప్రధానరంగాల షేర్లు పతనమవుతుండడంతో సూచీలన్నీ భారీగా నష్టపోతున్నాయి. 


ముంబయి స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 14,100 దిగువన ట్రేడ్ అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 555 పాయింట్లు దిగజారి 47,790 వద్ద... నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 14,083వద్ద కొనసాగుతున్నాయి.

Updated Date - 2021-01-27T19:48:13+05:30 IST