భరించలేని కడుపు నొప్పి.. 11 ఏళ్ల బాలిక పొట్టలోంచి డాక్టర్లు బయటకు తీసిన దాన్ని చూసి అవాక్కైన బంధువులు..!

ABN , First Publish Date - 2021-10-24T12:26:03+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఒక 16 ఏళ్ల అమ్మాయికి తీవ్ర కడుపునొప్పి ఉండడంతో సివివ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ అమ్మాయి మానసిక స్థితి బాగోలేదని డాక్టర్లు గ్రహించారు. ఆమె కడుపునొప్పికి కారణం తెలీకపోవడంతో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేశారు...

భరించలేని కడుపు నొప్పి.. 11 ఏళ్ల బాలిక పొట్టలోంచి డాక్టర్లు బయటకు తీసిన దాన్ని చూసి అవాక్కైన బంధువులు..!

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఒక 16 ఏళ్ల అమ్మాయికి తీవ్ర కడుపునొప్పి ఉండడంతో సివివ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ అమ్మాయి మానసిక స్థితి బాగోలేదని డాక్టర్లు గ్రహించారు. ఆమె కడుపునొప్పికి కారణం తెలీకపోవడంతో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఆ పరీక్షలు చేయగా ఆమె కడుపు ఉన్నది చూసి డాక్టర్లు అవక్కయ్యారు.


ఆ అమ్మాయి గతకొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఉందని తల్లిదండ్రులు చెప్పారు. ఆమె బరువు కూడా తగ్గిందని. ముందుగా ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్స ఖర్చు ఎక్కువకావడంతో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి తల్లిదండ్రులు మళ్లీ ఇంటిదారి పట్టారు. అక్టోబర్ 11న అమ్మాయికి మళ్లీ కడుపునొప్పి రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు సీనియర్ డాక్టర్ల బృందం పరీక్షలు చేయగా.. కడుపులో ఏదో పెద్దగా నల్లగా ఒక ఉండలాగా కనిపించింది. దాని బరువు కేవలం 500 గ్రాములు ఉంటుందని అంచనా వేశారు. 


వెంటనే డాక్టర్లంతా కలిసి ఆ బాలికకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్నది బయటికి తీశారు. అది ఒక వెంట్రుకల గుత్తి. ఆ అమ్మాయి మతిస్థిమితంలేని కారణంగా వెంట్రుకలను తినేసిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని చెప్పారు. ఆమెకు మానసిక సమస్యకు కూడా ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.

ఇలాగే నాలుగేళ్ల క్రితం కూడా వెంట్రుకలు మింగేసిందని, అప్పుడు కూడా అపరేషన్ చేసి తీయాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు.

Updated Date - 2021-10-24T12:26:03+05:30 IST