అయోధ్య రామాలయం నిర్మాణానికి శిల్పాలు సిద్ధం

ABN , First Publish Date - 2020-08-02T21:34:58+05:30 IST

రామాలయం నిర్మాణానికి అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి.

అయోధ్య రామాలయం నిర్మాణానికి శిల్పాలు సిద్ధం

అయోధ్య : రామాలయం నిర్మాణానికి అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఒకటో అంతస్థు వరకు అవసరమైన శిల్పాలు చెక్కే పనులు కూడా తుది దశలో ఉన్నాయి. రామాలయం నిర్మాణానికి ఈ నెల 5న భూమి పూజ జరుగుతుంది. 


రామ జన్మ భూమిలోని శిల్పాలు చెక్కే వర్క్‌షాప్ కేర్‌టేకర్ హనుమాన్ యాదవ్ మాట్లాడుతూ, రామాలయం మొదటి అంతస్థు వరకు అవసరమైన రాతి పని పూర్తయిందని, శిల్పాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ప్రక్షాళన పనులు దాదాపుగా పూర్తయ్యాయని, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సమావేశం అనంతరం మిగిలిన కొద్దిపాటి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 


రామాలయం నిర్మాణానికి ఇసుకరాతిని ఎంపిక చేసుకోవడానికి కారణాన్ని వివరిస్తూ, ఇసుకరాయి వేలాది సంవత్సరాలపాటు దిట్టంగా ఉంటుందని చెప్పారు. రామాలయం అవసరాలకు అనుగుణంగా శిల్పాలను అతి సూక్ష్మంగా చెక్కినట్లు తెలిపారు. 


రామ జన్మ భూమిలో రామాలయం నిర్మాణం కోసం స్టోన్ కార్వింగ్ వర్క్‌షాపును 1990లో  విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఏర్పాటు చేసింది. 


Updated Date - 2020-08-02T21:34:58+05:30 IST