భోగస్‌ పట్టాల ముఠాను అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-06-19T05:10:39+05:30 IST

మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలకు కొందరు ముఠాలుగా తయారై భోగస్‌ పట్టాలు సృష్టిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు సత్యం ఆరోపించారు.

భోగస్‌ పట్టాల ముఠాను అడ్డుకోండి
తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీపీఎం నేతలు

 తహసీల్దారుకు సీపీఎం నేతల వినతి

ప్రొద్దుటూరు అర్బన్‌ , జూన్‌ 18:  మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ అమృత నగర్‌లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలకు కొందరు ముఠాలుగా తయారై భోగస్‌ పట్టాలు సృష్టిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని  సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యుడు సత్యం ఆరోపించారు.  శుక్రవారం స్థానిక తహసీల్దారు నజీర్‌ అహ్మద్‌ ను కలిసి అమృతనగర్‌లోని భోగస్‌ పట్టాల అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ అమృతనగర్‌లో పేదలకు ఇచ్చిన పట్టాలు లబ్ధిదారులకు రెవెన్యూఅధికారులు గతం లో స్పష్టంగా కేటాయించక పోవడంతో ఒకరి పట్టాల్లో మరోకరు గృహాలు నిర్మించుకున్నారన్నారు. చాల మందికి పదేళ్ళు గడిచినా నేటికి వారి స్థలాలు చూపించలేదని దీంతో కొందరు ముఠాగా తయారై ఖాళీస్థలాలకు నకిలీ బోగస్‌ పట్టాలు సృస్టించి గతంలో పనిచేసిన తహసీల్దారుల సంతకాలు ఫోర్జరీ చేసి స్థలాలు విక్రయింస్తున్నరని ఆరోపించారు. కొందరు తమకు కేటాయించిన పట్టాల్లో పునాదులు నిర్మించుకుంటే వాటిని సైతం తొలగించి ఆక్ర మిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో కేవీపీఎస్‌ కార్యదర్శి పక్కీరయ్య, ఆటోయూనియన్‌ కార్యదర్శి యేసు, చెన్నారెడ్డి, సుబ్బారావు, సీఐటీయూ కార్యదర్శి విజయ్‌కుమార్‌, సాల్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T05:10:39+05:30 IST