Abn logo
Jul 6 2020 @ 05:26AM

‘రైల్వేలో ప్రైవేటీకరణను ఆపాలి’

కర్నూలు(న్యూసిటీ), జూలై 5: రైల్వే రంగంలో ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్‌ చేశారు. ఆదివారం కేకే భవన్‌లో జరిగిన రైస్‌మిల్‌ డ్రైవర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో బాబు, బాషా, ఆచారి, మధు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement