స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2021-08-01T07:20:10+05:30 IST

స్వయం సహాయక సంఘాల బలోపేతానికి గ్రామసంఘాలు, వీవోఏలు పనిచేసి వారి అభివృద్ధికి పాటు పడాలని దర్శి క్లస్టర్‌ వైఎ్‌సఆర్‌ క్రాంతి పథకం ఏరియా కో-ఆర్డినేటర్‌ డీ రజనీకాంత్‌ అన్నారు.

స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏసీ రజనీకాంత్‌

ముండ్లమూరు, జూలై 31 : స్వయం సహాయక సంఘాల బలోపేతానికి గ్రామసంఘాలు, వీవోఏలు పనిచేసి వారి అభివృద్ధికి పాటు పడాలని దర్శి క్లస్టర్‌ వైఎ్‌సఆర్‌ క్రాంతి పథకం ఏరియా కో-ఆర్డినేటర్‌ డీ రజనీకాంత్‌ అన్నారు. శనివారం వైఎ్‌సఆర్‌ క్రాంతిపథకం కార్యాలయంలో మండల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన వారిని ఉద్దేశించి ఏసీ మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలు బలోపేతానికి పాటు పడాలన్నారు. తీసుకున్న రుణాలను తిరిగి సకాలంలో చెల్లించే విధంగా సిబ్బంది పని చేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతి గ్రూపునకు రుణాలు ఇప్పిస్తామన్నారు. మండలంలో 1400 సంఘాలు పని చేస్తున్నాయన్నారు. వైఎ్‌సఆర్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలు అర్హత ఉన్న వారికి అందేలా చూడాలన్నారు. స్త్రీనిధి రికవరీ శాతం పెంచాలన్నారు. ఆగిపోయిన గ్రూపులను పునరుద్ధరించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఎం అనపర్తి సిమోన్‌, మండ ల సమాఖ్య అధ్యక్షురాలు తిరుపతమ్మ, ఉపాధ్యక్షురాలు పేరమ్మ, ప్రధాన కార్యదర్శి ఎలిశమ్మ, సీసీలు మోహన్‌రావు, శ్రీనివాసరావు, గురవయ్య, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-01T07:20:10+05:30 IST