Advertisement
Advertisement
Abn logo
Advertisement

దళితుల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు

తహసీల్దార్‌ వేణుగోపాల్‌

ఆనందపురం, నవంబరు 30: దళితుల హక్కులకు భంగం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌ హెచ్చరించారు. మండలంలోని తర్లు వాడలో సివిల్‌ రైట్స్‌ డే సందర్భంగా మంగళవారం మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దళితులకు ప్రభుత్వం కల్పించిన భూములను ఎవరైనా అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. దళిత గ్రామాల్లో ఎనిమిది నుంచి పీజీ చదివే విద్యార్థులకు వసతి సదుపాయం అవసరమైతే తమ దృష్టికి తీసుకువస్తే వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా దళిత హక్కులపై అవగాహన కల్పించారు. ఎంపీపీ మజ్జి శారదా ప్రియాంక మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను దళితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బీఆర్‌బి నాయుడు, నాయకులు వెంకటరావు, సత్యం, సోషల్‌ వెల్ఫేర్‌ అధికారులు అరుణ, షర్మిల, తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement