Abn logo
Oct 20 2020 @ 03:44AM

తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగితే కఠిన చర్యలు

Kaakateeya

జేసీ వేణుగోపాలరెడ్డి

విశాఖపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎక్కడైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి హెచ్చరించారు. ఆయన జిల్లాలోని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భూములు, దేవదాయ భూములు, ట్రస్టుల ఆస్తులు ఏవీ అన్యాక్రాంతం కాకుండా చూడాలని సూచించారు. భూముల లావాదేవీల్లో సబ్‌ రిజిస్ట్రార్లదే కీలక పాత్ర అని అప్రమత్తంగా ఉండాలన్నారు.


అన్ని డాక్యుమెంట్లు, రికార్డులు పరిశీలించాకే ముందుకు వెళ్లాలన్నారు.  సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ నాగలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్‌ కె.మన్మధరావు, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement