చెట్లను నరికితే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-02-28T11:04:36+05:30 IST

చెట్లను ఎక్కడైనా నరికితే కఠినంగా వ్యవహరి ంచాలని అవసరమైతే క్రిమినల్‌ కేసులు కూడా

చెట్లను నరికితే కఠిన చర్యలు

నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 27: చెట్లను ఎక్కడైనా నరికితే కఠినంగా వ్యవహరిచాలని అవసరమైతే క్రిమినల్‌ కేసులు  కూడా నమోదు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురు వారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి సునీల్‌, అదనపు సీపీ ఉషా విశ్వనాథ్‌ తదితర అధికారులతో నిర్వహి ంచిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌లతో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో ఈవిషయమై ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం లో పెద్దఎత్తున మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా బాధ్యత అన్నారు. కానీ చెట్లను నరికితే హరితహారంలో చేసిన శ్రమ అంతా వృథా అవుతుందని తెలిపారు. ఈ దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అవసర మైతే పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు అటవీని ధ్వంసం చేస్తే వారిపై, అక్రమ కలప రవాణా చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నా రు. జిల్లాలో ఎక్కడా చెట్లను నరకకుండా కటు ్టదిట్టమైన చర్యలు తీసుకోవాలని సొంత భూము ల్లో పెరిగిన చెట్లను నరకడానికి కూడా వాల్టా చట్టం ప్రకారం తప్పనిసరిగా అటవీశాఖ అను మతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.


అను మతి లేకుండా ఏరకమైన కలప అయినా రవా ణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రెగ్యులర్‌గా అడవులను ఽధ్వంసం చేసే వారిపై దృష్టి పెట్టాలని అదే విధంగా సామిల్లుల్లో రెగ్యు లర్‌గా తనిఖీలు నిర్వహించి అక్రమ కలప ఉన్న ట్లయితే కేసులు నమోదు చేయాలన్నారు. ఇం దుకు రెవెన్యూ, పోలీసు, అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. డివిజన్‌, మండల స్థాయిల్లో సంబంధిత అధికారులతో స మావేశం ఏర్పాటు చేసి అక్రమంగా చెట్ల నరికి వేత, కలప అక్రమ రవాణాను నిరోఽధించాల న్నారు. అడవులు దహనం కాకుండా కారణమై న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శా ఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఎక్కడైనా అక్ర మాలు జరిగితే స్పందించి నివారణ  చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో అవగాహన కల్పిం చడానికి అటవీశాఖాధికారులు గోడ ప్రతులు ముద్రించి అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ఈసమావేశంలో అదన పు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ విపా టిల్‌ అధికారులు పాల్గొన్నారు.


సమావేశమైన  మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ 

జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశ ం గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో నిర్వహించా రు. జిల్లాలో పనిచేస్తున్న ఎలకా్ట్రనిక్‌ మీడియా, ప్రింట్‌ మీడియా  ప్రతినిధులకు ఆయా యాజ మాన్యాలు సిఫార్సు చేసిన మేరకు  ప్రభుత్వ నిబంధనలు పరిశీలించి అర్హులైన వారికి కార్డు లను కలెక్టర్‌ మంజూరు చేశారు. ఈసమావేశంలో డీపీఆర్వో రామ్మోహన్‌రావు, కన్వీనర్‌ జమాల్‌పూర్‌ గణేశ్‌, అంగిరేకుల సాయిలు, కుంచ శ్రీనివాస్‌, పుల్గూరు నరేందర్‌, కె.లక్ష్మణ్‌, రవీందర్‌నాయక్‌, ఎస్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:04:36+05:30 IST