పేదలకు పథకాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-07-30T06:38:47+05:30 IST

ప్రభుత్వ పథకాలను పేదలకు అందే విధంగా సిబ్బంది చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాయని వైఎ్‌సఆర్‌ క్రాంతి పథకం పీడీ బీ.బాబూరావు అన్నారు.

పేదలకు  పథకాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

డీఆర్‌డీఏ పీడీ బాబూరావు

ముండ్లమూరు, జూలై 29 : ప్రభుత్వ పథకాలను పేదలకు అందే విధంగా సిబ్బంది చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాయని వైఎ్‌సఆర్‌ క్రాంతి పథకం పీడీ బీ.బాబూరావు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం మండలం కేంద్రం ముండ్లమూరులోని సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలైన వైఎ్‌సఆర్‌ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ పథకాలు లబ్ది దారులకు ఏ మేరకు చేరాయనేది రికార్డులు పరిశీలించారు. అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి పథకం అందే విధంగా చూడాలన్నారు. అనంతరం వైఎ్‌సఆర్‌ క్రాంతి పథకం కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. వైఎ్‌సఆర్‌ ఆసరాలో భాగంగా బయోమెట్రిక్‌ విధానాన్ని పరిశీలించారు. మొత్తం 1418 గ్రూపులు ఉండగా 1002 గ్రూపులు వైఎ్‌సఆర్‌ ఆసరా పథకంలో అర్హత సాధించాయన్నారు. పొదుపు సంఘంలో ఉన్న సభ్యురాలు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ వేయించాలన్నారు. ఇప్పటి వరకు తీసుకున్న స్త్రీనిధి, బ్యాంక్‌ లింకేజీ, సీఏఎఫ్‌, వీఆర్‌ఎఫ్‌, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులను తిరిగి సకాలంలో లబ్ది దారుల చేత వసూలు చేయించాలన్నారు. ఆగి పోయిన పొదుపు గ్రూపులను తిరిగి పునరుద్దరించాలన్నారు. అర్హత ఉన్న ప్రతి పొదుపు సంఘానికి సిబ్బంది రుణాలు ఇప్పించాలన్నారు.  సమావేశంలో ఏపీఎం అనపర్తి సిమోన్‌, సీసీలు మోహనరావు, గురవయ్య, శ్రీనివాసరావు, రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-30T06:38:47+05:30 IST