కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పటిష్ట భద్రత

ABN , First Publish Date - 2020-07-02T09:35:24+05:30 IST

అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా పంజా విసురుతోంది. దీంతో కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా

కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పటిష్ట భద్రత

డ్రోన్‌ కెమెరాలతో నిఘా

ప్రజలు బయటకు రావొద్దని పోలీసుల హెచ్చరిక

నిబంధనలు అతిక్రమించిన 12 మందిపై కేసులు


అనకాపల్లి టౌన్‌/కొత్తూరు, జూలై 1: అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా పంజా విసురుతోంది. దీంతో కంటెయిన్‌మెంట్‌ జోన్లలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన గవరపాలెంలోని దాసరిగెడ్డ రోడ్డు, సతకంపట్టు, దిబ్బవీధి, ముత్రాసువీధి తదితర ప్రాంతాలను కొవిడ్‌-19 డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ సీఐ ఎల్‌.భాస్కరరావు బుధవారం పరిశీలించారు.


కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ప్రజలు బయటకు రాకుండా డ్రోన్‌ కెమెరాలతో పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా వారు చెప్పారు. దీనిపై ఆటోల్లో మైక్‌సెట్లు ఏర్పాటు చేసి ప్రచారం చేయిస్తున్నామన్నారు. కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించిన అనవసరంగా బయట తిరుగుతున్న 12 మందిపై కేసులు నమోదు చేశామని వారు చెప్పారు. పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా లేకుంటే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. 

Updated Date - 2020-07-02T09:35:24+05:30 IST