Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

 

కామారెడ్డి టౌన్‌, నవంబరు 28: విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం వంద శాతం ప్రయత్నం చేయాలని, ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, పాటలు, ఇతర అంశాలను నేర్పాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు, బ్యాగులు, నోట్‌ పుస్తకాలు అందజేయడంతో పాటు వసతి గృహ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి రజిత, వసతి గృహ సంక్షేమాధికారిణి సరిత తదితరులు పాల్గొన్నారు.

కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయాలి

కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని రాధకృష్ణ ఇండస్ట్రీస్‌, క్యాసంపల్లిలోని వేంకటేశ్వర ఇండస్ట్రీస్‌ రైస్‌ మిల్లులను ఆదివారం కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. రైస్‌మిల్లులో ధాన్యం నిల్వ చేయడానికి ఖాళీ స్థలం వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తక్షణమే అన్‌లోడ్‌ చేయాలని సూచించారు. సోమవారం నుంచి రైస్‌మిల్లుల యజమానులు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో శ్రీను, ఎమ్మార్వో ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement