హైదరాబాద్ : రిసార్ట్‌లో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఐ?

ABN , First Publish Date - 2021-06-05T13:48:36+05:30 IST

ఎస్‌ఐ ఓ మహిళతో రిసార్ట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడటం హాట్‌ టాపిక్‌గా

హైదరాబాద్ : రిసార్ట్‌లో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఐ?

  • సోషల్‌ మీడియాలో వైరల్‌


హైదరాబాద్ సిటీ/కీసర రూరల్‌ : ఎస్‌ఐ ఓ మహిళతో రిసార్ట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపడటం హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం తిమ్మాయిపల్లిలోని సైలెంట్‌ వాల్ట్‌ రిసార్ట్‌లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు కీసర పోలీసులకు సమాచారం అందింది. అకస్మాత్తుగా దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ దాడుల్లో మేడ్చల్‌ జిల్లా పరిధిలోని ఎస్‌ఐ ఓ మహిళతో కలిసి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐను కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ను వాకబు చేయగా, ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని, ఎలాంటి విచారణ చేపట్టలేదని తెలిపారు.

Updated Date - 2021-06-05T13:48:36+05:30 IST