Advertisement
Advertisement
Abn logo
Advertisement

అటవీ గ్రామాల్లో పర్యటించిన సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రాజంపేట, డిసెంబరు7 : వరదల మూలంగా చెయ్యేటికి అవతల అటవీ ప్రాంతంలో ఉన్న తొగూరుపేట గ్రామ పంచాయతీ చింతలకోన గ్రామాన్ని రాజంపేట సబ్‌కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు  అందజేస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు రవిశంకర్‌రెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ విశాలాక్షి, ఐసీడీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Advertisement
Advertisement