సీబీఐ డెరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్ కుమార్ జైస్వాల్

ABN , First Publish Date - 2021-05-27T01:36:45+05:30 IST

సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ ప్రధాన

సీబీఐ డెరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్ కుమార్ జైస్వాల్

న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ ప్రధాన కార్యాలయంలో సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది సమక్షంలో ఆయన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ అధికారులు సీబీఐ వ్యవహారాల గురించి అప్‌డేట్ చెప్పారని ఓ అధికారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధురి సభ్యులుగా ఉన్న ఉన్నత స్థాయి కమిటీ జైస్వాల్‌ నియామకానికి ఆమోద ముద్ర వేసింది. కాగా, జైస్వాల్‌.. 1985 మహారాష్ట్ర కేడర్‌ ఐపీఎస్‌ అధికారి. ఆ రాష్ట్ర డీజీపీగానూ పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎ్‌సఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. జైస్వాల్‌ సీబీఐ డైరెక్టర్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

Updated Date - 2021-05-27T01:36:45+05:30 IST