Advertisement
Advertisement
Abn logo
Advertisement

పలకజీడిలో మెగా వైద్య శిబిరం సక్సెస్‌


రెండు వేల మందికి వైద్య సేవలు

కొయ్యూరు, నవంబరు 26: ఐటీడీఏ ఆధ్వర్యంలో శుక్రవారం మావోయిస్టు ప్రాబల్య యు.చీడిపాలెం శివారు పలకజీడిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైంది. ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ   శిబిరంలో రెండు వేల మంది గిరిజనులు వైద్య సేవలు పొందారు. గిరిజనులకు భోజన వసతి కల్పించారు. కేజీహెచ్‌ వైద్యులు, శంకర్‌ నేత్రాలయం, పలు ప్రైవేటు ఆస్పత్రుల వైద్య నిపుణులు రోగులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా పీవో రోణంకి గోపాలక్రిష్ణ మాట్లా డుతూ.. గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ, రవాణా, సమా చార వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అరకు, చింతపల్లి ఆసుపత్రుల్లో ఈ వారంలో సర్జరీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఏజెన్సీలో 979 గ్రామాలకు కనీస రవాణా సౌకర్యం లేదన్నారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వడం జరిగిందన్నారు. నెల రోజుల్లో 119 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు.  మన్యంలో సమాచార వ్యవస్థ మెరుగుకు 147 జియో టవర్లు, 130 ఎయిర్‌టెల్‌ టవర్లు మంజూరయ్యాయన్నారు. అనంతరం గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. శిబిరంలో ఏడీఎం హెచ్‌వో లీలాప్రసాద్‌, వైద్య నిపుణులు అహ్మద్‌, యోగేశ్‌, లక్ష్మి, శిరీష, లతశ్రీ, శ్రావ్య, కృష్ణారావు,విశ్వేశ్వరనాయుడు, హరిప్రణీత్‌ పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement