Advertisement
Advertisement
Abn logo
Advertisement

హరిపురి కాలనీలో విజయవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్

హైదరాబాద్: కరోనా నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. నగరంలోని పలు కాలనీల్లో శనివారం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్‌లోని హరిపురి కాలనీలో వ్యాక్సినేషన్ నిర్వహించారు. పలువురు కాలనీ వాసులు వ్యాక్సిన్ వేయించుకున్నారు. మరోవైపు నగరవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement