Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెరుకు కోతలు షురూ

- ఉమ్మడి జిల్లాలో 8వేల ఎకరాల  సాగు

- ఈ ఏడాది తగ్గిన సాగు విస్తీర్ణం  

- వేరు పురుగు ఆశించడంతో పంట నష్టం

-  ఇతర రాష్ట్రాల  కూలీలతో కోతలు

అమరచింత, నవంబరు 29: ఉమ్మడి జిల్లాలో సాగు చేస్తున్న చెరుకు పంటకోత ఈ ఏడాది సకాలంలో ప్రారం భించారు. ఉమ్మడి జిల్లాలో  15వేల ఎకరాలలో పంట సాగుచేసే వారు. ఈ ఏడాది  8 వేల ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే   సాగుచేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులు పండించిన చెరుకును సకాలంలో కొనుగో లు చేయకపోవడం, కనీస మద్ధతు ధర ఇవ్వకపోవడం, పర్యవేక్షిం చకపోవడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గించారు. ఉమ్మడి జిల్లాలోని చిన్నచింతకుంట, నర్వ, మక్తల్‌, గద్వాల, అయిజ, శాంతి నగర్‌, కొత్తకోట, అడ్డాకుల, మదనాపురం, ఆత్మకూర్‌, అమరచింత మండలాల్లో చెరుకు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వేరు పురుగు ఆశించడంతో పంట పూర్తిగా దెబ్బతిన్నదని,  షుగర్‌ ఫ్యాక్టరీ యాజ మాన్యం క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించకపోవడంతో ఈ నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. 

  టన్నుకు రూ. 3150  

 కనీస మద్ధతు ధర ప్రకటించాలని చెరుకు రైతు సంఘాలు ఆందోళన చేసి టన్నుకు రూ. 3150లు ప్రకటింపజేశాయి. గతం లో టన్నుకు  రూ. 2850 చెల్లించేవారు. ఈ ఏడాది అదనంగా రూ.300 చెల్లించడంతో రూ.3150 మద్దతు ధర ప్రకటించారు. ఫ్యాక్టరీ యా జమాన్యం ఇప్పటికే చెరుకు కోతలను కోయడానికి దాదాపు 50 బ్యాచుల కూలీలను ఇతర రాష్ర్టాల నుంచి పిలిపించారు. నర్వ, అమరచింత మండలాల పరిధిలో  పొలం వద్దనే గుడిసెలు  వేసుకుని చెరుకు కోత ప్రా రంభించారు.  

  రైతుపై భారం 

చెరుకు కోతలు కోయడానికి వచ్చిన కూ లీల చార్జీలు, రవాణా, ఇతర ఖర్చులు రైతుల కు భారమవుతున్నాయి. చెరుకు టన్నుకు లేబర్‌ చార్జీ రూ.460, రవాణా చార్జీ టన్నుకు రూ.240, కూలీల కుషీ, ఇతర ఖర్చులు పోను రైతుకు మిగిలేది టన్నుకు రూ. 2300 మాత్రమే వస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరుకు రైతుల కు ప్రోత్సాహం అందిస్తే సాగు విస్తీర్ణం పెంచే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.


చెరుకు కోసేందుకు వచ్చిన కూలీలు


కోతకు వచ్చిన చెరుకు పంట


Advertisement
Advertisement