Abn logo
Mar 6 2021 @ 01:49AM

యువకుడి ఆత్మహత్య

రాంగోపాల్‌పేట్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మూర్ఛ వ్యాధితో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలగూడకు చెందిన అజీజ్‌ఖాన్‌(23) పన్నెండేళ్లుగా మూర్చవ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి తగ్గకపోవడంతో ఈనెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై చిల్డ్రన్స్‌ పార్కు వద్ద హుస్సేన్‌ సాగర్‌లో మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి షర్ట్‌పై ఉన్న స్టైల్డ్‌ బై సామ్రాట్‌, సీతాఫల్‌మండి అన్న టైలర్‌ లేబుల్‌ సహాయంతో ఆ ప్రాంతంలో గాలించి చనిపోయింది అజీజ్‌ఖాన్‌గా గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement