గరివిడి: స్థానిక టీచర్స్ కాలనీలో పువ్వల ప్రదీప్ (20) అనే యువకుడు మంగళవారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ నారాయణరావు మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రదీప్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.